ఎంజాయ్.. ఏడాది చివరి వరకు ఇంటి నుండే పని..

Update: 2020-05-08 17:00 GMT

సాప్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అలవాటే. కరోనా నేపథ్యంలో దాదాపుగా అన్ని కంపెనీలు ఇంటి నుంచే పని చేయిస్తున్నాయి ఉద్యోగుల చేత. కరోనా తగ్గుముఖం పట్టినా ప్రజల్లో భయం మాత్రం అలానే ఉంది. లాక్డౌన్ అనంతరం ఆఫీసులకు రమ్మని చెప్పాలంటే భయపడుతున్నాయి కంపెనీలు. ఏ మూల కరోనా ఉందో ఎక్కడ దాడి చేస్తుందో అని మరోపక్క జంకుతున్నాయి.

వర్క్ ఫ్రం హోం ఒక్కటే పరిష్కారమని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పాటు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ భావిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పని చేయమని చెప్పాలనుకుంటోంది ఉద్యోగులకు. ఈ మేరకు ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఉద్యోగులందరికీ వర్క్‌ ప్రం హోం ఇస్తారా లేక 50 శాతం ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఈ రెండు సంస్థలే కాదు చాలా సంస్థలు మరి కొన్నాళ్లపాటు ఇంటి నుంచి పనిచేసే పద్ధతిని కొనసాగించాలని చూస్తున్నాయి. ఇక దేశంలోని కొన్ని రాష్ట్రాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబై, ఢిల్లీలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులతో పాటు సంస్థల యాజమాన్యాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం ఉత్తమమని వైద్య అధికారులతో పాటు ప్రముఖులు సైతం భావిస్తున్నారు. కాగా, కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఈనెల 17తో ముగియనుంది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారా లేక పొడిగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News