తమిళనాడులోని కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడు నైవేలీ లింగ్టైన్ కార్పొరేషన్ ప్లాంట్‌లో జరిగింది. ఈ పేలుడుతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు.. ఈ పేలుడు గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులో తీసుకొచ్చారు.