పాక్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేయనున్నట్లు ప్రకటించిన ప్రధాని

Update: 2020-05-08 15:16 GMT

దేశవ్యాప్తంగా దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం అనంతరం ఇమ్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కూలీలు, చిన్న పరిశ్రమలు, సామాన్య ప్రజలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకే తాము నిర్ణయించినట్లు తెలిపారు. పాక్ లో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 25,837కు చేరింది. ప్రాణంతకర వైరస్ కారణంగా ఇప్పటి వరకు పాక్ లో 594 మంది మృతి చెందారు.

Similar News