ఏపీలో ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల వల్ల పంటలు భారిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ తుఫాన్ వస్తే మిగిలిన రైతులు కుదేలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించాలని కోరారు.