కరోనాపై ఆయుర్వేద మందులు క్లినికల్ ట్రయల్స్

Update: 2020-05-09 08:48 GMT

కరోనా నివారణకు భారతీయ సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదం బాగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీంతో నాలుగు ఆయుర్వేద మందుల క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అశ్వగంధ, యష్టిమధు, గుడుచీ పిప్లీ, ఆయుష్ 64 మందులను క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. ఈ మందులపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ లతో కలిసి అధ్యయనం చేయనున్నాయి. ఆయుర్వేదంలో కరోనా నివారణకు పనిచేసే మెరుగైన మందులున్నాయని దీనిపై తాము పరిశోధనలు చేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖఱ్ మండే చెప్పారు.

Similar News