లాక్డౌన్ కారణంగా వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. సమ్మర్‌లో జరిగే వ్యాపారాన్నంత పోగొట్టుకున్నాయి ఎలక్ట్రానిక్ కంపెనీలు. అయితే గత కొద్ది రోజులుగా లాక్డౌన్ సడలింపులు చేసింది ప్రభుత్వం. దీంతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి కంపెనీలు. లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే గృహోపకరణాలను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది.
స్టే హోమ్.. స్టే హ్యాపీ.. లాగ్ ఇన్ టు గ్రేట్ ఆఫర్స్ పేరుతో ఆన్‌లైన్ ఫ్రీ బుకింగ్ ఆఫర్స్ అందిస్తోంది. ఇందుకోసం https://www.samsung.com/in/offer/online/ce-sale/ వెబ్‌సైట్ ద్వారా కావలసిన ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చు. ఈనెల 8వ తేదీ లోగా బుక్ చేసుకున్న వారికి 15 శాతం క్యాష్ బ్యాక్ అందించడంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ద్వారా 18 నెలల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది. దీంతో పాటు ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయం కూడా కల్పిస్తోంది.