ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరంలోనే కరోనా వైరస్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పరిసరాల విజ్ఞానంలో, 6 నుంచి 10వ తరగతి వరకు సైన్స్‌లోను, ప్లస్ వన్, ప్లస్ టూ సైన్స్ గ్రూపు విద్యార్థులకు కరోనా వైరస్ గురించిన పాఠ్యాంశాలు చేర్చనున్నారు. అలాగే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రీషియన్ వంటి పాఠ్య విభాగాల్లో కూడా కరోనా పాఠ్యాంశాన్ని చేర్చనున్నారు. కరోనా లక్షణాలు, దాని ప్రభావం, అది సోకే విధానం, జంతువుల నుంచి మానవులకు వ్యాపించిన విధానం, చికిత్స విధానం వంటి అంశాలు ఈ పాఠ్యాంశాలలో చోటుచేసుకోనున్నాయి. దీనికి సంబందించిన సమాచారాన్ని బయాలజీ టీచర్లు సేకరించే పనిలో పడ్డారు.