హైదరాబాద్ ఎల్బీనగర్‌ను కరోనా వైరస్ కుదిపేస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఎల్బీనగర్‌లో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నమోదైన పది కేసుల్లో ఐదు ఎల్బీనగర్‌వే.. ఇప్పటి వరకు ఎల్బీనగర్ జోన్‌లో 56కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతిచెందగా, 44 మందికి చికిత్స కొనసాగుతోంది. ఎల్బీనగర్‌లో 15 కంటైన్మెంట్స్ ఏర్పాటు చేశారు అధికారులు.