కరోనాను విజయవంతంగా ఎదుర్కొని.. కరోనా లేని రాష్ట్రంగా మారిన గోవా జాబితాలో తాజాగా మరో రాష్ట్రం వచ్చి చేరింది. దీంతో కరోనా ఫ్రీ రాష్ట్రాల జాబితాలో గోవా, మిజోరాం చేరాయి. మిజోరాంలో ఒకే ఒకరికి కరోనా సోకగా.. అతను కూడా పూర్తిగా కోలుకొని డిస్చార్జ్ అయ్యారు. మిజోరాంకు చెందిన 50 ఏళ్ల మతాధికారి నెదర్లాండ్స్‌కు వెళ్లి మార్చి 24 న కరోనా బారిన పడ్డాడు. గత 24 గంటల్లో కరోనా బారిన పడిన వ్యక్తికి సంబంధించిన రిపోర్టులో నాలుగుసార్లు నెగిటివ్ వచ్చిందని మిజోరాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆర్ లాల్తాంగ్లియానా అన్నారు. దీంతో అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్నారు. దీంతో మిజోరాం కూడా గోవా సరసన చేరింది.