కరోనాతో కలిసి బతక్క తప్పదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట అంబేద్కర్ నగర్‌లో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలో అనేక మంది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సిద్ధిపేట గ్రీన్‌జోన్‌లో ఉన్నా నిర్లక్ష్యం తగదని ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలని అన్నారు. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధించాల్సి వస్తుందని అన్నారు. ప్రజలందరి సహకారంతో కరోనాను ఎదుర్కుందామని ఆయన అన్నారు.