తెలంగాణ జిల్లాలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులు నమోదవటం లేదు. దీంతో త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఇక ఆర్ధిక పరిస్థితిని గాడి పెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నెమ్మదిగా లాక్ డౌన్ ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తూ వస్తోంది. మరో రెండ్రోజుల్లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే..వైరస్ కట్టడికి ఇదే కీలకమైన సమయం అని నిపుణులు అంటున్నారు. వలస కూలీలతో ప్రమాదం పొంచి ఉందని, అజాగ్రత్తగా ఉంటే మళ్లీ కరోనా విజృంభించటం ఖాయమంటున్నారు.