లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు తన వంతు సాయం అందించాలనుకుంది భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతీ చంద్. లాక్డౌన్ వలన భువనేశ్వర్‌లోనే ఉండిపోయిన ద్యుతీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామం వెళ్లి అక్కడి అవసరార్థులకు సాయం అందించింది. లాక్డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్న మా గ్రామస్తులకు నా చేతనైనంత సాయం చేయాలనుకున్నా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా మా ఊరికి కారులో వెళ్లాను. గ్రామంలోని పేదలకు నాకు తోచినంత సాయం అందించాను. సాయం అందుకున్న నిరుపేదలు చల్లగా ఉండు తల్లీ అని అనేసరికి నా కళ్లు ఆనందంతో చెమర్చాయి అని ద్యుతీ ట్విట్టర్‌లో వెల్లడించింది.