ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. లాక్ డౌన్ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం వల్లే కంపెనీకి అనుమతి దక్కిందని అన్నారాయన. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు టీడీపీపై బురదచల్లేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ప్లాస్టిక్ మద్యం బాటిళ్ల ఉత్పత్తి కోసమే ఎల్జీ పాలిమర్స్ ఆఘమేఘాల మీద అనుమతి ఇప్పించారని ఆయన ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ కు 1964లో కాంగ్రెస్ ప్రభుత్వం భూకేయింపులు చేస్తే.. జగన్ ప్రభుత్వం కంపెనీ విస్తరణకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు పట్టాభి. ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారాయన.