భారత్ లో కరోనా ప్రభావం తీవ్రంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4213 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 67152కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1559 మంది కోలుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 20917 మంది డిశ్చార్జ్ అయ్యారని.. ఇంకా 44029మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. అటు, రికార్డు స్థాయిలో గడిచిన 24గంటల్లో కేసులు నమోదు కావటంతో.. ఇప్పటి కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. అయితే.. కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రికవరీ రేటు 31.15గా ఉందని కేంద్ర ప్రకటించింది.