మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సాయంత్రం ఆయన ఛాతి నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వైద్యంలో భాగంగా ఇచ్చిన ఔషధాల వల్ల ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. దీంతో కరోనా పరీక్షలు కూడా జరిపామని, రిపోర్టు నెగటివ్‌గా వచ్చిందని పేర్కొంది. వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్‌లోని ప్రైవేట్ వార్డుకు తరలించినట్లు తెలిపాయి. ఆయన్ను ఒకట్రెండ్రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.