ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మరీ రోజురోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో.. 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 1142 మంది డిశ్చార్జి అయ్యారు. కర్నూలు జిల్లాలో కరోనాతో ఒకరు మరణించిడంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 47కు చేరింది.
బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. ఇక చిత్తూరు -11, కర్నూలు -7, తూర్పుగోదావరి - 4, అనంతపురం, కృష్ణా జిల్లాలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. గుంటూరు నుంచి కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారికే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇక కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన 140 మందిని ఇప్పటికే గుర్తించారు. వీరిందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ఓవరాల్ 591 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గుంటూరు -399, కృష్ణా -349, చిత్తూరు -142, అనంతపురం 118, నెల్లూరు -111 , కడప 97, పశ్చిమగోదావరి -68, విశాఖ -66, ప్రకాశం- 63, తూర్పుగోదావరి -51, శ్రీకాకుళం -5, విజయనగరంలో 4 కేసులు నమోదయ్యాయి.