ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోతలు పెడుతోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. లబ్దిదారుల ఎంపికకు అర్హతలు ప్రామాణికం కావాలి కానీ.. నిబంధనలు కాకూడదని సీపీఎం నేత బాబూరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారాయన. బడ్జెట్ భారం అవుతోందనో, మరొకటో కారణంగా చెప్పి.. లబ్దిదారులను తొలగించడం సరికాదని బాబూరావు హితవు పలికారు.