కరోనాపై పోరాటంలో పలువురు ప్రముఖులు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించారు. అయితే, తాజాగా దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిపాటు తన జీతంలో 30 శాతం కోత విధించుకున్నారు. తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఆయన ప్రయాణ ఖర్చులు, సాంప్రదాయ విందుల ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించుకోనున్నట్టు అధికారులు తెలిపారు.