ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-05-16 14:20 GMT

ఏపీలో కరోనా మహమ్మారీ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2205కు చేరింది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలో తొమ్మిదేసి కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 8 , కృష్ణా 7, విశాఖ4 , గంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కో కేసులు నమోదైంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంక్య 49కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 803 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1353 మంది డిశ్చార్జి అయ్యారు.

Similar News