అమెరికాలో కరోనా విలయతాండవం.. స్కూళ్లను రీ ఓపెన్ చేయాలని ఆదేశాలు

Update: 2020-05-16 08:48 GMT

అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా పాటించకపోవడం, లాక్‌డౌన్‌ను తొలగించడంతో వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న మహమ్మా రి కారణంగా 14 లక్షల 72 వేల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 89 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 3 లక్షల 19 వేల మంది రికవరీ కాగా, పది లక్షల మందికి పైగా ఆస్పత్రుల్లో ట్రీ ట్మెంట్ తీసుకుంటున్నారు.

కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఏప్రిల్‌లో నిరుద్యోగిత 14.7 శాతానికి చేరింది. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికమని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. గత 2 నెలల్లో నిరుద్యోగ భృతి కోసం 3 కోట్ల 60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపారాలను మూసివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కార్మికశాఖ తెలిపింది.

ఇదిలాఉంటే వైరస్ వ్యాప్తిని నిరోధించకపోతే వచ్చే శీతాకాలం నాటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రిక్ బ్రైట్ హెచ్చరించారు. విపత్కర పరి స్థితుల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటూ కరోనాను అరికట్టాలని చెప్పారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ ఆంథోని ఫౌసి కూడా ఇదే మాట చెప్పారు. ఒక్కసారి పరిస్థితి చేయి దాటితే తిరిగి కోలుకోలే మని ఫౌసి హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ట్రంప్ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 25 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా స్కూళ్లను కూడా రీ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News