హైదరాబాద్‌ శివారులో చిరుత కలకలం.. అటవీ అధికారులు హెచ్చరికలు

Update: 2020-05-16 15:14 GMT

హైదరాబాద్‌ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది చేస్తోన్న ఆపరేషన్‌ కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం చిరుతపులి.. హిమాయత్‌ సాగర్‌ చెరువు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు చుట్టుపక్కల గ్రామాల్లో సంచరినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం అజీజ్‌ నగర్‌ పరిసరాల్లోని హిమాయత్‌ సాగర్‌ ఒడ్డున ప్రత్యక్షమైన చిరుత... అక్కడనుంచి శంషాబాద్‌ మండలం మార్లగూడకు చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చిరుత కనిపించినట్లు చెబుతున్నారు స్థానికులు. చిరుత సంచరించిన ఆనవాళ్లు సైతం గుర్తించారు అటవీ అధికారులు. దీంతో కవ్వగూడ, మర్లగుడ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లను విడిచి బయటకు రావద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అంతకు ముందు .. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. జాతీయరహదారి నుంచి తప్పించుకున్న.. చిరుత పక్కనే ఉన్న ప్రాంతంలోకి వెళ్లేందుకు యత్నించిది. ఆ సమయంలో.. ఓ లారీ క్లీనర్‌పై దాడి చేసి గాయపరిచింది. అదే సమయంలో.. అక్కడున్న కుక్కలు ... చిరుతపై దాడికి యత్నించాయి. ఆ తర్వాత అక్కడినుంచి తప్పించుకుంది. ఈ దృశ్యాలన్నీ.. సీసీటీవీలో రికార్డయ్యాయి. అటు.. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారుల ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Similar News