ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా రహదారిపై రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 21 మంది వలస కూలీల దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్ నుంచి వలస కూలీలు స్వస్థలాలకు వెళ్తుండగా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వలస కూలీలు వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.