భారత్‌పై ప్రేమను.. మోదీపై ప్రశంసలను కురిపిస్తున్న ట్రంప్

Update: 2020-05-16 12:35 GMT

మొన్నటికి మొన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపించకపోతే భారత్ అంతు చూస్తానన్న అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఈ రోజు ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకున్న మంచి స్నేహితుల్లో మోదీ ఒకరు అని భాతర ప్రధానిపై ప్రేమను కురిపిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వ్యాక్సిన్ తయారీ కోసం ఇరు దేశాలూ కలిసి పరిశోధనలు చేస్తున్నాయని అన్నారు. పరస్పరం సహకరించుకుంటూ కోవిడ్ మహమ్మారిని మట్టుపెడతామని అన్నారు. అమెరికా జనాభాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. కోవిడ్ చికిత్సలో భాగంగా భారత్‌కు వెంటిలేటర్లు అందిస్తామని ట్రంప్ తెలిపారు.

Similar News