లాక్డౌన్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన 10, 11 తరగతుల విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన డేట్ చార్టులను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక సిబిఎస్‌ఈ కూడా పరీక్షల షెడ్యూల్‌ను మే 16 ప్రకటిస్తానని చెప్పింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాపడి మే 18న రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. కాగా, జులై 1 నుంచి 15 వరకు సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందనే సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.