తమిళనాడులో కరోనా విలయతాండవం.. కొత్తగా 477 కేసులు

Update: 2020-05-16 22:14 GMT

తమిళనాడులో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతీరోజు నమోదైన కేసులు వందల్లో ఉంటున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. వైరస్ ప్రభావం తగ్గటంలేదు. గడిచిన 24 గంటల్లో మొత్తం 477 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 10,585కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ 3,541 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 6,970 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకూ 74 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Similar News