కరోనా కాటు.. 13.5 కోట్ల మంది ఉద్యోగాలపై వేటు..

Update: 2020-05-18 14:33 GMT

కోవిడ్ మహమ్మారి.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే కొన్ని చిన్న సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్డర్ డి.లిటిల్ అంచనా ప్రకారం భారత్‌లో సుమారు 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికాన్ని అనుభవిస్తారని వెల్లడించింది. రోజు రోజుకు భారత్‌లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే రికవరీ రేటు అంచనా వేయడం కష్టంగా ఉందని అంటూ ఆర్థిక రేటు డబ్ల్యూ ఆకారంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆర్థిక సవాళ్లను అధిగమించడం.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం పేరుతో రూపొందించిన ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నిరుద్యోగ రేటు ప్రస్తుతం ఉన్న 7.6 శాతం నుంచి 35 శాతానికి ఎగబాకొచ్చు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని మొత్తం మీద దేశంలో 17.4 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారని నివేదిక తెలిపింది.

Similar News