కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం నిర్వహించనుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిన నేపథ్యంలో.. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ.. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు.. లాక్‌డౌన్ 4 కొనసాగుతోంది. ఇప్పటికే మరిన్ని సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణాను పునరుద్ధరించారు. రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రమే నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి.