స్కూల్ ఫీజులు వసూలు..

Update: 2020-05-20 18:20 GMT

లాక్డౌన్ 4.0లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు సడలించిన కేంద్రం.. విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు తెరవకూడదని స్పష్టం చేసింది. ఫీజులు వసూలు చేయకూడదని, ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ ఆఫ్ చండీగఢ్ తమ ఇబ్బందులను వివరిస్తూ విద్యాశాఖకు విన్నవించుకుంది. పాఠశాలల యాజమాన్య హక్కులు కాపాడాలని, అలాగే జీతాలు చెల్లించడంతో పాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఫీజు వసూలు చేయాల్సిన ఆవశ్యకతను వివరించింది. ఇందుకు విద్యాశాఖ సానుకూలంగా స్పందించింది. ప్రైవేటు స్కూళ్లు నెలవారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్, మే నెలల ఫీజును మే 31 వరకు చెల్లించవచ్చని, ఎలాంటి పెనాల్టీ విధించవద్దని స్పష్టం చేసింది.

Similar News