ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతంలో కోతలు పెట్టవద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కోరారు. మార్చి, ఏప్రిల్‌లో చెల్లించాల్సిన సగం వేతన బకాయిలు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి 15వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. FRBM పరిమితిని పెరగడంతో.. అదనంగా 20వేల కోట్లు రుణాలు సేకరించే వెసులుబాటు లభించిందని గుర్తుచేశారు. CPS రద్దు, PRC అమలు, సమాన పనికి సమాన వేతనం హామీలు నెరవేర్చాలని సీఎం జగన్‌ను తులసిరెడ్డి డిమాండ్ చేశారు.