ఇళ్ల స్థలాల కోసం అగ్రిగోల్డ్ భూములు కొని పేదలకు పట్టాలుగా ఇవ్వొచ్చు : ముప్పాళ్ల నాగేశ్వర్రావు

Update: 2020-05-21 10:12 GMT

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ముప్పాళ్ల నాగేశ్వర్రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో న్యాయం చేస్తామని చెప్పి ఏడాదైనా ఇంత వరకూ దీనిపై నోరు మెదపడం లేదన్నారు. బాధితులు మరోసారి ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ఉండాలంటే తక్షణం సాయం చేయాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూములు కొని పేదలకు పట్టాలుగా ఇవ్వొచ్చని సూచించారు. ప్రభుత్వం ఇకనైనా స్పందిచకపోతే 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల కేంద్రాల్లో 48 గంటల విజ్ఞాపన దీక్షలు చేస్తామన్నారు ముప్పాళ్ల.

Similar News