తిరుపతి లడ్డు హైదరాబాదులోనూ..

Update: 2020-05-21 17:25 GMT

భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఎప్పడు కలుగుతుందో ఇప్పుడప్పుడే చేపలేమంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన భక్తుల కోరిక మేరకు శ్రీవారి లడ్డూని ప్రముఖ నగరాల్లోని సమాచార కేంద్రాల్లో విక్రయానికి ఉంచుతామన్నారు. రాష్ట్రంలోని టీటీడీ కళ్యాణమండపాలతో పాటు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో లడ్డూల విక్రయం జరుగుతుందన్నారు. రూ.50 లడ్డూను రూ.25లకే విక్రయిస్తామన్నారు. వేల సంఖ్యలో లడ్డూలు కావాలన్నా ముందుగా బుక్ చేసుకుంటే సరఫరా చేస్తామని ప్రకటించారు.

Similar News