ఢిల్లీని కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 571 కేసులు

Update: 2020-05-21 18:55 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు 500కు పైగా నమోదవ్వడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 571 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య11659కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, గురువారం 375 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వాగా.. ఇప్పటి వరకూ 5,567 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ 194 మంది కరోనాతో మృతి చెందారని ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Similar News