ఆంఫన్ తుపాను బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను తీవ్రంగా నష్ట్ర పరిచింది. రెండు రాష్ట్రాలలో పర్యటించిన ప్రధానిమోదీ బెంగాల్ కు వెయ్యి కోట్లు, ఒడిశాకు 500 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆంఫన్ తుపాన్ వలన పశ్చిమ బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని.. అన్ని విధాలగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. అటు, మృతుల కుటుంబాలకు రెండు లక్షలు.. గాయపడిన వారికి 50 వేలు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. అటు, పశ్చిమ బెంగాల్ తరువాత ఒడిశా వెళ్లిన మోదీ 500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారికి అండగా ఉంటామని ప్రకటించారు.