విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరెంటు ఛార్జీల పేరుతో 120 కోట్లు భారం మోపారని మండిపడ్డారు. నిత్యావసర సరుకులు 75 నుంచి 150 శాతం పెరిగిపోయాయని ఆరోపించారు. నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.