ఢిల్లీలో కొత్తగా 412 కరోనావైరస్ కేసులు

Update: 2020-05-26 16:51 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కరాళనృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 412 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,465 గా ఉంది. వైరస్ కారణంగా మొత్తం మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 288 గా ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఢిల్లీ తెలిపింది. ఇక గత 24 గంటల్లో 6,535 కొత్త కోవిడ్ -19 కేసులు, 146 మంది మరణించినట్లు భారత్ తెలిపింది. 4167 మరణాలతో సహా దేశంలో మొత్తం 1,45,380 కేసులు ఉండగా.. 60,490 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 80,722 క్రియాశీల కేసులున్నాయి.

Similar News