భానుడి భగభగలు.. మరో మూడు రోజులు ఇలాగే ఎండలు..

Update: 2020-05-26 16:56 GMT

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక రాయలసీమలో అయితే 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత ఉంటుందని వివరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయింత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

దక్షిణ బంగాళా ఖాతం, అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈనెల 27 న వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఇలా ఉండగా ఉపరితల ద్రోణి, ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయని అన్నారు.

Similar News