సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు చుక్కెదురు

Update: 2020-05-26 16:19 GMT

విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లలిత్ ధర్మాసనం.. ఎన్జీటీ లేదా హైకోర్టు దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణ కొనసాగించేందుకుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో.. ఎల్జీ పాలిమర్స్ లోకి వెళ్లి పరిశీలించేందుకు 30మంది కంపెనీ ప్రతినిధులకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Similar News