సకాలంలో 108 వాహనం లేక ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. గుమ్మలక్ష్మీపురం మండలం చప్పగూడ గ్రామానికి చెందిన ధనలక్ష్మీ నిండు గర్భిణీ. ఆమెకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. 108కి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. 108 రాకపోవడంతో.. ఆటోలోనే ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే... ఆమె ప్రసవించింది. అనంతరం అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమమని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లడంతో తల్లి బిడ్డ ప్రాణాలు దక్కాయంటున్నారు బంధువులు. ఇప్పటికైనా... 108 వాహనం అందుబాటులో ఉంచాలని వేడుకుంటున్నారు.