రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనపాలన- మీ సూచన పేరుతో నిర్వహించిన మేధోమధనం కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. రైతు భరోసా- పిఎం కిసాన్ ద్వారా ప్రతిరైతుకు 13వేల 5వందలు పంటసాయం అందిస్తున్నామన్నారు. తొలి ఏడాదిలోనే 10వేల 209 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చామని వివరించారు. రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నామన్నారు. రూ.1వెయ్యి 270 కోట్లు బీమా ప్రీమియం కూడా చెల్లించామని వివరించారు. పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు సహాయం అందిస్తామన్నారు.