న్యాయమూర్తులపై వ్యాఖ్యలపట్ల వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

Update: 2020-05-26 18:56 GMT

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చిక్కుల్లోపడ్డారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యలపట్ల ఇద్దరికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. 49 మందికి నోటీసులు జారీచేసింది. ఇందులో నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. అనంతరం తదుపరి విచారణను 3 వారల పాటు వాయిదా వేసింది. కాగా సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టుకు లేఖ రాశారు ప్రముఖ న్యాయవాది లక్ష్మీనారాయణ.

Similar News