కడప జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. బద్వేలు నియోజకవర్గంలో నేతలు తన్నుకున్నారు. బి.కోడూరు మండలం పాయలకుంటలో సచివాలయ భూమి పూజ సందర్భంగా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకరిపై ఒకరు పడి చొక్కాలు చించుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడి చేసుకున్నారు. దాడిలో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు.