ప్రేమపక్షులు ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం

Update: 2020-05-28 16:36 GMT

పుణ్యాలన్ అగర్బత్తిస్ సినిమాలో తన నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోకులన్ ఓ ఇంటివాడయ్యారు. కరోనావైరస్ లాక్ డౌన్ మధ్య ప్రియురాలు ధన్యను వివాహం చేసుకున్నారు. కేరళలోని ఎర్నాకుళంలోని ఓ ఆలయంలో వీరు వివాహం చేసుకున్నారు. కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా, పరిమితంగా అతిధులను పిలిచిన గోకులన్.. అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ప్రియురాలి మెడలో మూడుముళ్లు వేశారు.

కాగా ధన్య తన చిరకాల ప్రియురాలు అని గోకులన్ గతంలో చెప్పారు. వాస్తవానికి వీరి వివాహం రెండు నెలల కిందటే జరగాల్సి ఉంది. అయితే కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. అయితే ఇటీవల పెళ్లిళ్లకు కేంద్రం అనుమతిచ్చిన నేపధ్యంలో ఈ ప్రేమపక్షులు ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం అయింది.

Similar News