TS : విరిగిన చెట్లు.. రోడ్లకు కోత.. ఎల్బీనగర్ లో వరద బీభత్సం

Update: 2024-05-18 16:46 GMT

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి ఎల్బీనగర్‌ సర్వీస్‌ రోడ్డులో భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

స్థానికుల సమాచారంతో విరిగిన చెట్ల కొమ్మలను డీఆర్ఎస్, జీహెచ్‌ఎంసీ, ఎల్బీనగర్ పోలీసులు తొలగించారు. వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు దంచి కొట్టిన వర్షంతో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఎల్బీనగర్‌, చింతలకుంటలోని జాతీయ రహదారిపై వరద నీటితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

జాతీయ రహదారి నుంచి దిగువన కాలనీలలోకి వెళ్లాల్సిన ప్రజలు వరద ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటిని కింది నాలాల్లోకి పంపించేందుకు జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీ సహాయంతో తోడి నీటిని పంపించారు.

Tags:    

Similar News