తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది. నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 24 నాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ఫలితంగా తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. పలుచోట్ల గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో వాన కురవనుంది.
హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదగిరి గుట్ట, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే చాన్సుంది.