దేశ వ్యాప్తంగా మొత్తం సుమారు 23లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారని కేంద్రం ప్రకటించింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో విదేశాల నుంచి చాలా మంది సొంత ఊర్లకు చేరుకున్నారని.. అటు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారు కూడా స్వస్థలాలకు చేరుకున్నారని అన్నారు. వీరంతా ఆయా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంటున్నారని కేంద్రం తెలిపింది. కానీ, అధికారిక హోదాలో ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉంటున్నారని మొత్తం 22.81 లక్షలమంది క్వారంటైన్ లో కనీషం వారం రోజులు ఉంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఎక్కువగా 6.02 మంది క్వారంటైన్ లో ఉన్నారని.. తరువాత రెండో స్థానంలో గుజరాత్ లో 4.42 లక్షల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతన్నాయి.