హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చాను : నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంలో హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవి బాధ్యతలు తీసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపట్లోనే తాను తిరిగి విధుల్లోకి చేరుతున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. హైకోర్టు తీర్పుతోనే తాను విధుల్లోకి చేరుతున్నానని అన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుత ఎస్ఈసీ కనగరాజ్ రాజీనామా చేయనున్నారు.