వలస కూలీలకు సుప్రీం బాసట..

Update: 2020-05-28 19:00 GMT

గురువారం వలసకూలీలకు సుప్రీంకోర్ట్ బాసటగా నిలిచింది. వలసకార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారివద్దనుండి ఎటువంటి ప్రయాణ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. అంతేకాదు వారి ప్రయాణ సమయంలో వలసదారులకు ఉచితంగా భోజనం, నీరు అందించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్రాలను కోరింది. వలస కూలీల సమస్యలను సమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు వెల్లడించింది. లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం,

రైలు లేదా బస్సులో ప్రయాణానికి ఎటువంటి ఛార్జీలు వలస కార్మికుల నుండి వసూలు చెయ్యొద్దని.. దానిని రాష్ట్రాలే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. వలస కార్మికులకు రాష్ట్రాల వారీగా స్టేషన్లలోనే భోజనం అందించాలని, ప్రయాణంలో వారికి ఆహారాన్ని అందించాలని న్యాయస్థానం పేర్కొంది. అలాగే రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు ఒంటరిగా ఉన్న కార్మికులకు ఆహారం అందించడానికి స్థలం , సమయకాలాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

Similar News