ఓవైపు కరోనాతో జనం అష్టకష్టాలు పడుతుంటే.. ఇప్పుడు మిడతలు దాడికి రెడీ అయ్యాయి. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌లోకి అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు తరలి వస్తోంది మిడతల దండు. దీంతో రైతుల్ని అప్రమత్తం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి అన్ని రాష్ట్రాలు. తెలంగాణకూ మిడతల నుంచి ముప్పు ఉండటంతో.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్.