గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో 70 ఏళ్లుగా ఆహారం, నీరు లేకుండా కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచి 90 ఏళ్లు మనుగడ సాగించిన యోగి ప్రహ్లాద్ జానీ అలియా చున్రివాలా మాతాజీ మంగళవారం ఉదయం మరణించినట్లు ఆయన శిష్యులు తెలిపారు.ఆయన వయసు 90. జాని తన స్వగ్రామమైన చరాడ వద్ద తుది శ్వాస విడిచారు. ఆహారం, నీరు తీసుకోకుండా ఆయన ఎలా జీవిస్తున్నారని శాస్త్రవేత్తలు 2003, 2010 లో పరీక్షించారు.
దేవుడే తనను సృష్టించాడని అందుకే తనకు ఆహారం, నీరు అవసరం లేదని చెప్పేవారు. జానీ మృతదేహాన్ని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయానికి సమీపంలో ఉన్న అతని ఆశ్రమం గుహకు తరలించారు. భక్తులు నివాళులర్పించేందుకు వీలుగా మృతదేహాన్ని రెండు రోజులు ఆశ్రమంలో ఉంచారు. గురువారం ఆశ్రమంలోనే సమాధిలో ఉంచుతామని శిష్యులు విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంబా దేవత భక్తుడగుల వలన ఎప్పుడూ ఎర్ర చీర (చున్రి) ధరించేవారు అది కూడా స్త్రీలా దుస్తులు ధరించేవారు, అందుకే అతన్ని చున్రివాలా మాతాజీ అని పిలుస్తారు.
'ఆధ్యాత్మిక అనుభవం' కోసం జానీ చాలా చిన్న వయస్సులోనే తన తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టారు. అతను 14 సంవత్సరాల వయస్సులో ఆహారం మరియు నీరు తీసుకోవడం మానేశానని అతని అనుచరులు పేర్కొన్నారు. జానీ చిన్న వయస్సులోనే అంబాజీ ఆలయానికి సమీపంలో ఉన్న ఒక చిన్న గుహను తన ఇంటిగా చేసుకుని అనంతరం యోగిగా ప్రాచుర్యం పొందారు. ఆయనను సందర్శించిన వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.