రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం జగన్‌తో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఏపీ సీఎం జగన్ కు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. లాక్‌డౌన్4.0 మే31తో ముగుస్తుండటంతో తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్రం రాష్ట్రాల సీఎంలను సంప్రదిస్తుంది. ఇందులో భాగంగానే అమిత్ షా.. జగన్ కు కాల్ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీసారు. లాక్‌డౌన్ కొనసాగించాలా? వద్దా? అనే విషయాలపై జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్4.0లో ఎక్కవ మినహాయింపులు ఇవ్వడంతో కరోనా ఎక్కవగా విజృంభిస్తుందన్న వార్తలు రావడంతో.. ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా చర్చిస్తున్నారు.